ఐకాన్ స్టార్, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ను ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడ నుంచి తమ వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పుష్ప-2బెనిఫిట్ షో సందర్భంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో సంధ్య ధియేటర్‌కు రావడంపై పోలీసులు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసునమోదు చేశారు. అల్లు అర్జున్ రాకతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా…ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి
ఇకపోతే డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. పుష్ప-2సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకున్నారు. బౌన్సర్లతో ధియేటర్ వద్దకు వచ్చి హల్‌చల్ చేశారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Post Views: 23