Mahaa Daily Exclusive

  ఏలూరులో స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రారంభం* -ఏలూరు జిల్లా పోలీస్.

Share

ఈ రోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ IPS గారి ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మరియు మహిళలపై నేరాల నివారణ కోసం *స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్ షాప్* (సైనిక్) ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు అధికారులు, గ్రామదీప్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నిర్వహించారు.

 

*కార్యక్రమ విశేషాలు*

విద్యార్థులను ప్రజా భద్రత రాయబారులుగా తయారు చేయడమే ప్రధాన లక్ష్యం.

స్టూడెంట్ అంబాసిడర్లు సైబర్ నేరాల గురించి అవగాహన పెంచి, మహిళల భద్రతకు కృషి చేయాలని ఉద్దేశం.

ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వారు మరింత మందికి జ్ఞానాన్ని పంచాలని సూచించారు.

ఎస్పీ గారు మాట్లాడుతూ..

సైబర్ నేరాలు, నకిలీ మెసేజ్‌లు (లాంటె ఎస్బీఐ రివార్డ్స్) వల్ల ప్రజలు మోసపోవకుండా విద్యార్థులు తమ పరిసరాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

సైబర్ నేరాలు ఎదురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా 95550351100 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.

హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణలో అవి కీలకమని వివరించారు.

 

*మరిన్ని చర్యలు*

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కోసం ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి IAS వారు హామీ ఇచ్చారు.

స్కూల్స్, కాలేజీల వద్ద మహిళల రక్షణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

సీసీటీవీలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు, అనర్థాలు తగ్గుతాయని, ఈ విషయంపై ప్రచారం చేయాలని సూచించారు.

 

*భవిష్యత్ లక్ష్యం*

విద్యార్థులు భవిష్యత్తులో ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషించి సమాజంలో మార్పు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమం యువతకు ప్రజా భద్రత, సామాజిక బాధ్యతపై అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుందని అన్నారు.