Mahaa Daily Exclusive

  రైతులకు – వినియోగదారులకు మేలు చేకూర్చే చర్యలు

Share

కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయి ధర కథనాలపై మంత్రి అచ్చెన్నాయుడు చర్యలు –
రైతుల నుంచి మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు –
కిలో 8/- చొప్పున కొనుగోలు చేసి అదే ధరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో విక్రయాలు-
కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయికి ధర పడిపోయిందనే కథనాలపై మంత్రి అచ్చెన్నాయుడు చర్యలు చేపట్టారు.
లాభ నష్టాలు లేకుండా కిలో టమాటా రూ.8/- కి కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో అదే ధరకు విక్రయించాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, తక్కువ ధరకు వర్షాధార నాసిరకం టమాటా మార్కెట్లో అందుబాటులో ఉండడంతో సాధారణ టమాటా ధరపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అటు రైతులకు ఇటు వినియోగదారులకు మేలు జరిగే విధంగా మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు విక్రయాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.