Mahaa Daily Exclusive

  అల్లు అర్జున్ అరెస్టుపై వర్మ సంచలనం..దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా..?

Share

సినీ హీరో అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించినా సరే ఒకరోజు రాత్రి జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.. వెంటనే ఆయన తన నివాసానికి వెళ్లారు. అయితే ఈ కేసు మీద ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. నేరుగా సంబంధం లేకపోయినా ఇలా ఒక నేషనల్ అవార్డు విన్నర్ ను అరెస్ట్ చేయడం దారుణం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశం మీద వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు.

 

1. పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?

 

2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?

 

3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?

 

4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ? అంటూ ఆయన ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.