Mahaa Daily Exclusive

  అందరూ సమానమే.. బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్..

Share

ఐకాన్ సార్ అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయంపై తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు.

 

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్టం పని తాను చేసుకుపోతుందని, ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని సీఎం అన్నారు. మహిళ మృతి కేసులో చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసిన విషయం కూడా విమర్శలు చేసేవారు గుర్తించాలన్నారు. అలాగే సినీ అగ్ర నటుడు మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, తాను ఆ విషయంపై మాట్లాడడం సమంజసం కాదన్నారు.

 

కానీ పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్.. తెలంగాణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపే సమయంలో, సీఎం రేవంత్ రెడ్డి పేరును ఇతరుల ద్వారా తెలుసుకొని ఉచ్చరించారు. దీనితోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బన్నీ అరెస్ట్ విషయంలో తన జోక్యం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.