Mahaa Daily Exclusive

  ఫార్ములా కార్ రేస్ కేసులో సంచలనం.. ఏ1గా కేటీఆర్.. ఏ2గా అరవింద్ కుమార్..

Share

హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేర్లు తెరమీదికి వచ్చాయి. అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ఏ1గా, ఏ2గా అరవింద్ కుమార్ పేర్లు నమోదయ్యాయి. అలాగే ఏ3గా హెచ్‌ఎండీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిప్రైవేట్ కంపెనీ సీఈవో బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా గల కేటీఆర్, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ. 55 కోట్ల నిధులను విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.

 

బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్ రేస్ లో అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పేరు వినిపించడంతో గవర్నర్ కు ప్రభుత్వం ఫైల్ పంపించింది. గవర్నర్ నుండి తాజాగా గ్రీన్ సిగ్నల్ రాగా ఏసీబీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి కేటీఆర్ పై 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్ ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. అలాగే ఈ కేసులను ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద నమోదు చేయగా.. 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులుగా ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఏసీబీ రంగంలోకి దిగి కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీని నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఏసీబీ అధికారులు సమర్పించి, కేసు విషయాలను న్యాయమూర్తికి వివరించినట్లు కూడా తెలుస్తోంది.

 

కాగా ఇటీవల ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ స్పందిస్తూ.. ఇందులో అధికారుల ప్రమేయం లేదని, అంతా తనకు తెలుసని కూడా ప్రకటించారు. అలాగే అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్దమంటూ ప్రకటించేశారు. జైలుకు వెళితే రోజూ జిమ్ ప్రాక్టీస్ చేస్తానని, ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చనే రీతిలో కేటీఆర్ కామెంట్స్ చేశారు. తాజాగా ఏసీబీ కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ లో ఏ1గా కేటీఆర్ పేరు నమోదు కావడంతో బీఆర్ఎస్ కొంత ఉలికిపాటుకు గురైందని చెప్పవచ్చు. మరి ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

 

ఎఫ్‌ఐఆర్‌లోని కీలక అంశాలు..

 

– ఎఫ్ఐఆర్ నెంబర్ 12/ ఆర్సీవో – సీఐయూ – ఏసీబీ 2024

– పీసీ యాక్ట్, ఐపీసీ యాక్ట్ కింద కేసుల నమోదు

– 13(1) (ఏ) 13(2) పీసీ యాక్ట్, 409, 120బీ ఐపీసీ సెక్షన్స్ కింద కేసు

– బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ఏసీబీకి అందిన ఫిర్యాదు

– ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎంఏయూడీ ఐఏఎస్ అధికారి దాన కిషోర్

– ఆ ఫిర్యాదు మేరకు ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు

– అవకతవకలపై ప్రభుత్వం విచారణ చెయ్యగా బయటపడ్డ బాగోతాలు

– ప్రభుత్వ నిధులు రూ.54 కోట్ల 88 లక్షల 87 వేల 43 అక్రమ బదిలీలు

– యూకేకు చెందిన ఎఫ్‌ఈవో ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీ

– రెండు విడతల్లో చెల్లింపులు. మొదట(3/10/2023) రూ.22 కోట్ల 69 లక్షల 63 వేల 125

– రెండోసారి (11/10/2023) రూ.23 కోట్ల లక్షా 97 వేల 500 బదిలీ

– హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి బదిలీ

– విదేశీ కంపెనీకీ చెల్లింపులతో హెచ్ఎండీఏకు రూ.8 కోట్ల 6 లక్షల 75వేల 404 అదనపు పన్ను భారం

– రూ.10 కోట్లకు మించి ఇలా బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్ధిక శాఖ అనుమతి అవసరం

– సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేకపోవడంతో హెఎండీఏ నిధుల మళ్లింపు