Mahaa Daily Exclusive

  తెలంగాణ పది పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

Share

తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ రెండో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 21న తెలుగు, 22న హిందీ, ఉర్దూ 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2 తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలను ఆయా తేదీలలో నిర్వహించనున్నారు. విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి చక్కగా చదివి ఉన్నత మార్కులు సాధించాలని ప్రభుత్వం ఆకాంక్షించింది.

 

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను సైతం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ప్రభుత్వం పది పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల కావడంతో, ఇక పరీక్షల కాలానికి విద్యార్థులు స్వాగతం పలకాల్సిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థుల కోసం ఆయా పాఠశాలలు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నాయి.

 

పరిక్షలంటే భయం చెందే విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపడంతో పాటు, ఉన్నత మార్కుల సాధనకు పాటించాల్సిన అంశాలపై ఉపాధ్యాయులు దృష్టి సారించారు. ప్రతి విద్యార్థి ఉన్నత మార్కులు సాధించేలా, తర్ఫీదు ఇవ్వాలని ప్రభుత్వం సైతం ఆదేశాలిచ్చింది. కాగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరిక్షలంటే భయం కలిగిన విద్యార్థుల తో మాట్లాడి, వారిలో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా చూడాల్సిన బాధ్యతను తీసుకోవాలని టీచర్స్ కోరుతున్నారు.

 

సమయాన్ని వృథా చేయకుండా, సమయానుసారం ప్రత్యేక టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని పుస్తక పఠనం సాగించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వం సైతం విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించేలా తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల సందేహాలను టీచర్స్ ఎప్పటికప్పుడు నివృతి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ టెన్త్, ఇంటర్ రాసే విద్యార్థులకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.