హైదరాబాద్, మహా : సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు హీరో అల్లు అర్జున్ సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేధికగా అర్జున్ ఓ లేఖ విడుదల చేశారు. తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అర్జున్ హెచ్చరించారు. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్జున్ కోరారు.
Post Views: 13