Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ రెడ్డికే మద్దతిస్తున్నాం – ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Share

సీఎం రేవంత్ రెడ్డికే మద్దతిస్తున్నాం
-ఏపీలో కూడా బెన్ఫిట్ షోలకు అనుమతించొద్దు
-అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు
-అభిమానుల పేరుతో ఎదురుదాడి సరికాదు
-ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

హైదరాబాద్, మహా: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న దురదృష్ణ ఘటనతో సినిమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెన్ఫిట్ షోలకు ఇక నుంచి అనుమతించబోమంటూ ప్రభుత్వం పేర్కొనడం హర్శించతగ్గ నిర్ణయమన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలను పెంచడం, బెన్ఫిట్ షోలకు అనుమతివ్వడం పరిపాటిగా మారిందని, ఆ విధానాలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తెలంగాణ మాదిరిగా ఏపీ ప్రభుత్వం కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులు అల్లు అర్జున్ కు మద్దతు పలకడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెంది, బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. వారి గురించి మాట్లాడాల్సిందిపోయి హీరోకు మద్దుతు తెలపడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ఆయన వారిని ప్రశ్నించారు. ఆ విధంగా మాట్లాడే రాజకీయ నాయకులు నైతికంగా పతనమైనట్టేనన్నారు. ఇటు అల్లు అర్జున్ కూడా శనివారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కానీ, ఘటన జరిగిన తరువాత ఆయన రియాక్షన్ సరిగా లేదన్నారు. పైగా అభిమానుల పేరుతో ఎదురుదాడి సరికాదంటూ అల్లు అర్జున్ పై ఆయన ఫైరయ్యారు.