Mahaa Daily Exclusive

  శ్రీతేజ్ ను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్…!

Share

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్ లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం పరామర్శించారు.
శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలుడిని సంపూర్ణ ఆరోగ్యం కలగాలని భగవంతుడిని కోరుతున్నానని, ఇప్పటికైనా పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని కోరారు. తనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టమని పేర్కొన్న బండి సంజయ్, ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించాలని కోరారు.