Mahaa Daily Exclusive

  బండి సంజయ్, పురందేశ్వరిపై మంత్రి పొన్నం మండిపాటు…!

Share

అల్లు అర్జున్ రేవంత్ వ్యాఖ్యలు సరైనవే

ఎవరిపై ఎలాంటి కక్ష సాధింపులు లేవు

బండి సంజయ్, పురందేశ్వరిపై మంత్రి పొన్నం మండిపాటు

వేములవాడ, మహా : అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన సరైందేనని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిపై కక్ష సాధింపు లేదని, ఎవరిని వేధించాలన్న ఉద్దేశ్యం లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించి తర్వాత సంజయ్ స్పందించాలన్నారు. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్, ఎంపీ పురందేశ్వరి వ్యాఖ్యలను ప్రస్తావించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. వారు వారి రాష్ట్రంలో జరిగే అంశాలను చూసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ క్లాసెస్ చూసుకోండి, ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండని సూచించారు. ఎంపీ పురందేశ్వరికి అంత హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంట్ లో జరిగిన దాడి సంఘటనలో రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసుపై పురందేశ్వరి సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదన్నారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను ఎందుకు తప్పు పట్టడం లేదని ప్రశ్నించారు,.ఎన్టీఆర్ ను ఉద్దేశించి అవే వ్యాఖ్యలు చేస్తే పురందేశ్వరి ఊరుకుంటారా అని మండిపడ్డారు. దమ్ముంటే బండి సంజయ్, పురందేశ్వరిలు అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.