Mahaa Daily Exclusive

  నోస్ట్రాడమస్ జోస్యం- 2025 సంచలనాలు.. అనూహ్య వైపరీత్యాలు

Share

సంచలనాలకు మారుపేరుగా కొత్త సంవత్సరం నిలవబోతుందా? వచ్చే ఏడాది అంతా హ్యాపీయేనా? కొత్త వైపరీత్యాలు దూసుకొస్తాయా? న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది? 2025పై ప్రపంచం ముందున్న అంచనాలేంటి?
……………………..

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది తమకు మంచి జరగాలని అందరూ కోరుకుంటారు. 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త దర్శకుడు, ప్రసిద్ధ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ ఓ సంచలనం. ఆయన చెప్పిన అంచనాలు చాలావరకు నిజమయ్యాయి. 2025 అంచనాలు ఈ ప్రపంచంలో ఎన్నో సంచలనాలు ముప్పును పేర్కొంటున్నాయి. ఇవి నిజమా కాదో తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా వీటిపై చర్చ జరుగుతోంది. నోస్ట్రాడమస్ 1555 సంవత్సరంలో ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతోందో బ్రహ్మంగారి తరహాలో చెప్పాడు. తన పుస్తకంలో 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని అంచనాలు కూడా ప్రస్తావించాడు. నోస్ట్రాడమస్ అని పిలిచే మిచెల్ డి నోస్ట్రేడామ్.. ప్రవచనాలకు ప్రసిద్ధి చెందాడు.

నోస్ట్రాడమస్ టాప్ 10 అంచనాలు ఇవీ

1. ఇంగ్లండ్‌లో క్రూరమైన యుద్ధాలు “పురాతన ప్లేగు” మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. ఆయన అంచనా ప్రకారం.. శత్రువు కన్నా వినాశకరమైనది.

2. 2025లో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొంటుందని లేదా ప్రమాదకరంగా దగ్గరగా వచ్చి మానవాళికి ప్రమాదం కలిగిస్తుంది

3. ప్రపంచ రాజకీయాల్లో గణనీయమైన మార్పు జరుగుతుంది. స్థాపించిన పాశ్చాత్య దేశాల ప్రభావంలో తగ్గుదల, కొత్త ప్రపంచ శక్తుల ఆవిర్భావం ఈ మార్పును కలిగి ఉంటుంది.

4. ప్రపంచవ్యాప్తంగా హరికేన్లు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. భౌగోళిక అస్థిరత, సౌర కార్యకలాపాలు, వాతావరణ మార్పుల సంగమం ఈ విపత్తులకు దారి తీస్తుంది.

5. బంగారం లేదా వెండికి బదులుగా “కాయిన్ లెదర్” విలువ ఎక్కువగా పెరుగుతుంది. దీని కారణంగా ఆర్థిక అస్థిరత, ఆర్థిక విపత్తు లేదా కరెన్సీ విలువలో పెనుమార్పును సూచిస్తాయి.

6. 21వ శతాబ్దం వైద్య సాంకేతికతలో గణనీయమైన అభివృద్ధిని చూస్తుంది. అనారోగ్యం నివారణ, చికిత్సలో గణనీయమైన మెరుగుదల కనిపించనుంది.

7. కొత్త ప్రపంచ కరెన్సీ కనిపిస్తుంది. ఇది సాంప్రదాయ జాతీయ కరెన్సీల నిష్క్రమణను సూచిస్తుంది. ప్రపంచ వాణిజ్యం, వ్యాపారానికి మద్దతుగా ఈ కొత్త కరెన్సీ చక్రం తిప్పనుంది.

8. అంతరిక్ష సాంకేతికతలో గణనీయమైన పురోగతి, కొత్త గ్రహాలు, ఖగోళ వస్తువుల ఆవిష్కరణగా ఈ కాలాన్ని పేర్కొనవచ్చు.

9. గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీ సైబర్‌ అటాక్ జరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం, కమ్యూనికేషన్, భద్రతపై ఈ సైబర్ దాడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

10. వినాశకరమైన వరదల మధ్య ఒక సామ్రాజ్యం ఉద్భవించి అదే “జల సామ్రాజ్యం”. వాతావరణ సంబంధిత విపత్తుల ఫలితంగా ఒక కొత్త శక్తి ఆవిర్భావంగా పరిగణించవచ్చు.