అదేంటి ఎన్టీఆర్ మాట తప్పడం ఏమిటీ అని ఆశ్చర్యపోకండి. ఈ మాటలు అంటున్నది మేము కాదు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఒకరు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఒకరు అవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా దేవర సినిమా రిలీజ్ ముందు కౌశిక్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ తో బాధపడుతుండగా చావు బతుకుల మధ్య ఉన్న అతన్ని ఆదుకుంటామని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. కలిసి సినిమా చూద్దామని, ఆర్థిక సాయం చేస్తామని మాట ఇచ్చి చాలా రోజులు అవుతున్నా ఇప్పటికి ఎలాంటి సాయం చేయాలేదని…కొడుకు కాపాడాలని తల్లి వేడుకుంటూ మీడియా ముందుకు వచ్చింది. గతంలో బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్‍తో వీడియో కాల్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాడు.
ఆ సమయంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న కౌశిక్ ను అదుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 11 లక్షల రూపాయలు, టీటీడీ ఇచ్చి ఆర్థిక సాయంతో కౌశిక్ కు ఇప్పుడు ఆపరేషన్ పూర్తి అయ్యిందని, మరో 20 లక్షల రూపాయల ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. కౌశిక్ కుటుంబ సభ్యులకు అంత స్థోమత లేకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెన్నై అపోలో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. మొత్తం 77 లక్షలు ఇవ్వాల్సి ఉండగా చివరికి ఇరవై లక్షలు అందిస్తే డిశ్చార్జ్ చేస్తామని అపోలో యాజమాన్యం చెబుతోంది. సహాయం చేస్తామన్న ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లేదని కౌశిక్ తల్లి వాపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదని బాలుడి తల్లి సరస్వతి చెబుతోంది