- మృతుల్లో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్
- మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కామారెడ్డి, మహా : కామారెడ్డిలో మిస్టరీగా మారిన ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కేసులో స్పీడ్ పెంచారు పోలీసులు. ఈ కేసులో ఆ ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ హిస్టరీ తీస్తున్నారు. ఈ కాల్ డేటాలో ముగ్గురూ వారం రోజులుగా గంటల తరబడి మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది. మరోవైపు, బీబీపేట నుంచి కామారెడ్డి మండలం నరసన్నపల్లికి బైక్ పై వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అక్కడ ఎస్ఐ సాయికుమార్ కారులో ఎక్కాడు. అయితే, నిఖిల్ తీసుకొచ్చిన బైక్ ఎక్కడుంనేది మిస్టరీగా మారింది. పోలీసు శాఖలో పని చేస్తున్న ఎస్ఐ, మహగిళా కానిస్టేబుల్ తో పాటు మరో కంప్యూటర్ ఆపరేటర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగింది? ఆ ముగ్గురి మృతికి కారణం ఏంటి? అనేది మిస్టరీగా మారింది. ఆ ముగ్గురి మరణం వెనుకున్న మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సదాశివనగర్ కు సంబంధించిన సీఐకి కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు. అసలు ఈ ముగ్గురి మరణం వెనుక ఏం జరిగింది? అనేది పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దర్యాఫ్తు కొనసాగుతోంది. బికనూరు ఎస్ఐ సాయికుమార్ కు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఇక, సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ ఈ ముగ్గురి కాల్ డేటాను సేకరించారు. అలాగే వాట్సాప్ చాట్ ను కూడా సేకరించారు. దాదాపు వారం రోజుల పాటు ఈ ముగ్గురూ గంటల తరబడి మాట్లాడుకున్నట్లు అందులో తేలింది.
ముగ్గురూ కలిసి కారులో ఎక్కడికి వెళ్లారు?
బికనూరు ఎస్ఐ సాయికుమార్ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద ఆయన కారులో వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆయన ఒక్కడే కామారెడ్డి వైపు వస్తున్నట్లు అందులో ఉంది. అటు కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ కామారెడ్డి చేరుకున్నారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి కారులో ఎటు వెళ్లారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. వారు నేరుగా అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్లారా? లేక మరో చోటుకి వెళ్లారా? ఎక్కడైనా భోజనం చేశారా? ఈ దిశగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.
చెరువు దగ్గర ఏం జరిగింది? ఘర్షణ పడ్డారా?
ఇక నిఖిల్ కు సంబంధించిన బైక్ మిస్ అయ్యింది. కామారెడ్డి మండలం నరసన్నపల్లికి వచ్చిన తర్వాత నిఖిల్ బైక్ ఎక్కడ పెట్టాడు? అసలు అతడి బైక్ ఏమైంది? అనేది మిస్టరీగా మారింది. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాఫ్తులో కొంత కీలక సమాచారం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఘర్షణ పడ్డ తర్వాత ముగ్గురిలో ఒకరు ఆత్మహత్య చేసుకుని ఉంటే, మిగతా ఇద్దరూ భయపడి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
ట్రయాంగిల్ స్టోరీయే కారణం
బీబీపేట పోలీసుస్టేషన లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి, బీబీపేట సొసైటీల కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న నిఖిల్ లు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ తో శృతి దగ్గరైంది. ఈ ట్రయాంగిల్ స్టోరీయే ముగ్గురి ఆత్మహత్యలకు దారి తీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ముగ్గురి ఫోన్ డాటాతో పాటు వాట్సప్ ఛాటింగ్ ను పోలీసులు వడపోస్తున్నారు. శృతి విషయంలో నిఖిల్ సాయికుమార్ లు గత కొంత కాలంగా ఘర్షణ పడుతున్నారని, ఈ నేపథ్.ంలోనే సాయికుమార్ కు శృతికి మధ్య ఉన్న సంబంధం తెలుసుకున్న ఎస్ఐ సాయికుమార్ భార్య అపుట్టించికి వెళ్ళిపోయిందని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సాయికుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో పాటు శృతిని మాట్లాడేందుకు కామారెడ్డికి రప్పించారని, అక్కడి నుంచి సదాశివనగర్ మండలం అడ్లూరి చెరువు వద్దకు వెళ్ళారని తెలిసింది. మాటల మధ్యలో శృతి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెరువులో దూకడంతో నిఖిల్ కూడా దూకాడని, వీరిద్దరి ఆత్మహత్యతో కంగారుకు గురైన ఎస్ఐ సాయ.ికుమార్ కూడా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత ఆత్మహత్యకు పాల్పడ్డ శృతి గర్భవతి అని అనుమానాలు వ్యక్తమవుతకుండగా, పోస్టుమార్టం రిపోర్టు వస్తే థప్ప ఏమీ చెప్పలేమని జిల్లా ఎస్పీ సింధూశర్మ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కొంత సాంకేతికతను వినియోగించి కేసు దర్యాప్తును సాగించాల్సి ఉందని, ఏది ఏమైనా త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.







