Mahaa Daily Exclusive

  మహిళలకు రూ.2 లక్షల ప్రయోజనం.. బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి

Share

మహిళలకు రూ.2 లక్షల ప్రయోజనం.. బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం ఎల్‌ఐసీ బీమా సఖీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మూడేళ్ల శిక్షణ సమయంలో మహిళలు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆర్థిక సహాయం, కమీషన్ ప్రయోజనం పొందుతారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో 18 ఏళ్లు దాటిన వారు అర్హులు. ఈ స్కీమ్ దరఖాస్తు కోసం వెబ్‌సైట్‌ https://licindia.in/test2 ను సందర్శించాలి. ఆ తర్వాత క్లిక్ ఫర్ బీమా సఖి ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం మీ పేరు వివరాలతో పూరించండి. శాఖల పేర్లు, బ్రాంచ్‌ని ఎంచుకుని “సబ్మిట్ లీడ్ ఫారమ్”పై క్లిక్ చేస్తే సరి.