Mahaa Daily Exclusive

  ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పద మృతి..

Share

అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోగి నివాసంలో శుక్రవారం రాత్రి కాల్పులు వినిపించాయి. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, ఆయన తలపై తుపాకితో కాల్చినట్లు కనిపించింది.

 

దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రెండు బుల్లెట్లను అధికారులు గుర్తించారు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు. ఆయన 2022లో ఆప్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.