వచ్చేనెల ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగానే బంగారం పై మూడు శాతం జీఎస్టీని ఒకటి శాతానికి తగ్గించాలని గోల్డ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బడ్జెట్ తర్వాత బంగారు నగలు మరింత చౌకగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బంగారంపై జీఎస్టీని తగ్గించడం ద్వారా భారీ ప్రయోజనం చేకూర్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆదాయ సమాన నిష్పత్తిని ఒక శాతానికి తగ్గించాలని పరిశ్రమలో డిమాండ్ ఉంది. ఇది జరిగితే బంగారం కొనుగోలుదారులు పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు.
Post Views: 71







