వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని దేవలమ్మనాగారం గ్రామంలో స్వయంభుగా వెలసిన ఆది మహా విష్ణు దేవస్థానం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు, దేవాలయ రాజగోపురం, శిఖర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆలయం కమిటీ ఆహ్వానం మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిమగల మహావిష్ణు స్వయంభుగా వెలిసిన ఆదిమహావిష్ణు స్వరూపాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శోభ కలిగి ఉండాలని ఆ దేవుని కోరారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి సమన్యాయం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, ఆ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యాల రాజశేఖరరావు, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కర్ణాకర్, డైరెక్టర్లు రాజు, రామారావు, జమాల్పూర్ శ్యామ్ లాల్, శివ పాల్గొన్నారు.