రోజురోజుకూ పాయల శంకర్ భూబాధితులు పెరుగుతున్నారని, ఒక్కొక్కరుగా తమ వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారని, ఈ విషయంలో వారికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రజాసేవా భవన్, క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యలను విన్నవించారు. పైసా పైసా కూడబెట్టి భూమలు కొనుగోలు చేస్తే కొందరు రాజకీయ నేతలు పలుకుబడిని ఉపయోగించి ఆక్రమించుకున్నారని, తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కంది శ్రీనివాసరెడ్డికి విన్నవించారు. బాధితులతో కార్యాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. వారికి కంది శ్రీనివాసరెడ్డి ధైర్యం చెప్పి అండగా ఉంటానని అభయమిచ్చారు
Post Views: 47








