పట్టణంలోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి కనిపించింది. స్థానిక మర్వాడీ ధర్మశాలలో గల శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్లు కట్టారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, ఆ స్వామివారి కృపాకటాక్షాలు తమపై ఉంటాయనేది భక్తుల నమ్మకం. అటు పట్టణంలోని మంగ మఠం ఆలయం, బంగారి గూడ వెంకటేశ్వర ఆలయం, న్యూ హౌజింగ్ బోర్డ్ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం, జైనథ్ మండలంలోని సుప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. దర్శనం కోసం వచ్చినవారి కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధల నడుమ స్వామిని దర్శించుకుని సంతోషం వ్యక్తం చేశా








