Mahaa Daily Exclusive

  రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో రాణించిన కానిస్టేబుల్ అభినందించిన కమిషనర్ …!

Share

గత నెల హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ సాయిరాం ఐదు కిలోమీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సందర్బంగా పతకాన్ని సాధించిన కానిస్టేబుల్ ను కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తు మరిన్ని పతకాలను సాధించి ఇతరులకు స్ఫూర్తి కావాలని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ స్పర్జన్ రాజ్ పాల్గొన్నారు.