Mahaa Daily Exclusive

  పద్మ అవార్డులపై నరేష్ సంచలన వ్యాఖ్యలు….!

Share

పద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు, మా అమ్మ విజయనిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించాను కానీ అమ్మకు పద్మ అవార్డు రాలేదు అన్నారు.

 

నేను ఏ గవర్నమెంట్‌ను కూడా విమర్శించడం లేదు అన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.

 

ఎంజీఆర్ బతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు.. సీనియర్ ఎన్టీఆర్‌కి కూడా రాలేదు అన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఆ అర్హత కలిగినవాళ్లు ఉన్నారు… మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పు లేదు అన్నారు.