Mahaa Daily Exclusive

  హైవే పైకి వచ్చేటప్పుడు తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన ..!

Share

కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో నేషనల్ హైవే పైకి వచ్చే ప్రయాణికులు, రోడ్డు దాటుతున్న ప్రజలు ప్రమాదాల పట్ల అవగాహన కల్గి ఉండాలని కూసుమంచి శిక్షణ ఎస్ఐ దివ్య ప్రజలకు సూచించారు. శుక్రవారం నాయకన్ గూడెం రైతు వేదిక వద్ద రైతులతో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ట్రైనింగ్ ఎస్సై దివ్య మాట్లాడుతూ నేషనల్ హైవే లో వాహనాలు వేగంగా వెళ్తుంటాయని, ప్రజలు తొందరపడి హైవే దాటేందుకు ప్రయత్నం చేయోద్దన్నారు. అలాగే హైవే పైకి గేదేలు, ఆవులు, జీవాలు ఎక్కువ వస్తుంటాయని, ముఖ్యంగా గేదేలు రోడ్డు పైకి రావడం, నల్లగా ఉండటంతో రాత్రి వెళ్ళలో కనిపించకుండా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల గేదేలకు రేడియం స్టిక్కర్ లను అతికించాలని, కొమ్ములకు రేడియం స్టిక్కర్ లను అతికించాలని, లేదంటే కలర్స్ వేయాలని సూచించారు. గేదెలు, ఆవులు రోడ్డు పైకి రాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ బాలసుబ్రమణ్యం, రూట్ మేనేజర్ కొండలరావు, కార్తీక్, సతీష్ యాదవ్, వేణు, సురేష్ ,మధు రహదారి భద్రత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు