అక్కినేని హీరో అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్సయింది. ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను ఇక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడు వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. మార్చి24న అఖిల్ వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలకు కూడా జరుపుకొని తేదీని ఫిక్స్ చేశారని టాక్. అఖిల్-జైనాబ్ వివాహం ఘనంగా చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారని అంటున్నారు. సినీ సెలబ్రెటీలు , రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్ ను కూడా వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది.
Post Views: 44