Mahaa Daily Exclusive

  దావోస్లోనూ అల్లు అర్జున్ టాపిక్  – సీఎం రేవంత్‌ రెడ్డి స్పందన

Share

 

హైదరాబాద్, మహా

పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్‌ అరెస్టైన ఆ తరువాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన ఇంగ్లీష్ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్‌ మరోసారి స్పందించారు. 10 నుంచి 12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు : తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించారు. 2 రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారని అన్నారు. అయినా సంధ్య థియేటర్‌ వద్దకు అల్లు అర్జున్‌ వచ్చారని గుర్తు చేశారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారని, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారని, ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చని తెలిపారు. ఒక మహిళ చనిపోతే, 10 నుంచి 12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని వివరించారు.