Mahaa Daily Exclusive

  ఢిల్లీ ప్రచారానికి తెర రేపే పోలింగ్…!

Share

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఇక్కడి 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. 19 వేల హోంగార్డులు, 35 వేల 626 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఢిల్లీలో కోటి 56 లక్షల మంది ఓటర్ల కోసం 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 67 చోట్ల జయభేరి మోగించింది. బీజేపీ కేవలం మూడు చోట్ల మాత్రమే నెగ్గింది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62 చోట్ల ఆమ్‌ఆద్మీ పార్టీ నెగ్గింది. బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. ఈ రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈసారి ఎవరు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటారో ఫిబ్రవరి 8న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది.