వీఎంలపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎంలలోని డేటాను తొలగించకుండా చూడాలని పిటిషన్ దాఖలు కాగా ఆ పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం నేడు విచారించింది. ఈ క్రమంలో ఈవీఎంలలోని డేటాను డిలీట్ చేయవద్దని ఆదేశించింది. అలాగే ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో 15 రోజుల్లోగా నివేదికను అందజేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
Post Views: 67