Mahaa Daily Exclusive

  ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్లా: మాజీ ఎమ్మెల్యే షకిల్

Share

ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్లానని బోధన్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. దాని వల్లే నేతలకు, కార్యకర్తలకు దూరమయ్యానన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన కొడుకుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయవద్దని సీపీని కోరినట్లు వెల్లడించారు.