Mahaa Daily Exclusive

  బెదిరింపులతో విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారు: సజ్జల

Share

కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం మేయర్ పదవిని బెదిరించి లాక్కున్నారని, ఏపీలో నియంతృత్వ పాలన సాగుతోందని అన్నారు. విశాఖలో బలం లేకపోయినా అభ్యర్థులను బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేశారన్నారు. ఓ బీసీ మహిళను పదవి నుంచి తప్పించారంటూ విమర్శించారు. వైసీపీ పార్టీ మాత్రమే రాష్ట్రంలో సమన్యాయం పాటించిందన్నారు.