TG: డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. ఇవాళ నగరంలోని టీవర్క్స్ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ వర్చువల్ సందేశం పంపారు. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడిపై ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్‌ను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.
Post Views: 103








