Mahaa Daily Exclusive

  ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థిగా పాకా వెంకటసత్యనారాయణ బిజెపి అనూహ్యనిర్ణయం..!

Share

ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నాయకుడు పాకా వెంకటసత్యనారాయణను అధిష్ఠానం ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికకు ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా ఈ స్థానం నుంచి అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణమాదిగ పోటీ చేస్తారని ప్రచారం సాగినా చివరికి బీజేపీకి ఆ అవకాశం దక్కింది.