Mahaa Daily Exclusive

  అక్రమ ఇసుక రవాణాలను అడ్డుకున్న మాడుగుల పోలీసులు…!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు. మాడుగుల పోలీసు మంగళవారం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో గస్తీ నిర్వహిస్తుండగా, ఒక ట్రాక్టర్ అనుమానస్పదంగా వాళ్లకు ఎదురుగా రావడంతో, ట్రాక్టర్ను ఆపి పరిశీలించగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు గుర్తించారు. డ్రైవర్ను విచారించగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను నల్లచెరువు వాగు నుంచి దొంగతనంగా తీసుకొస్తున్నామని తెలిపాడు. మాడుగుల మండలం, నల్లచెరువు గ్రామానికి చెందిన వరికుప్పల శివ, ట్రాక్టర్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా, మాడుగుల పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాడుగుల సిఐ తెలిపారు.