Mahaa Daily Exclusive

  నూతన ఎన్.సి.సి కల్నల్ ను సన్మానించిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి….!

Share

కరీంనగర్ మహా:

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని దేశాన్ని రక్షించడానికై అన్ని వేళలల్లో అందుబాటులో ఉండాలని తద్వారా సమాజంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ హై స్కూల్ కు విచ్చేసినటువంటి నూతన కల్నల్ అధికారి ఎ.కె.జయంతను.. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యన్.సి.సి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా.. సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు.. యన్.సి.సి వారి విధివిధానాలు ప్రశంసనీయమైనవని.. పౌరులకు రక్షణ కవచంలాంటివని వారు అభివర్ణించారు. నూతనంగా నియమితులైన కల్నల్ అధికారి ఎ.కె. జయంత కు శుభాకాంక్షలు తెలియజేసారు.. వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే వివిధ కార్యక్రమాలకు చేయూతనిస్తామని.. విద్యార్థులను కూడా అధిక సంఖ్యలో ప్రోత్సహించి కార్యక్రమాలను విజయవంతం చేస్తామని చెప్పారు.
జయంత మాట్లాడుతూ అల్ఫోర్స్ పాఠశాలలో యన్.సి.సికి సంబందించిన ప్రణాళికలను విద్యార్థులకు పలు నైతిక విలువలతో పాటు దేశ రక్షణకు సంబందించిన విషయాలు పాఠశాల అధినేత నరేందర్ రెడ్డి సారధ్యంలో విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణను ఇవ్వడం జరుగుతున్నదని. సమాజ అభివృద్ధికి తోడ్పడుతాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, యన్.సి.సి. అధికారులు పాల్గొన్నారు.