భూపాలపల్లి, మహా :
భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలంలోని బుద్ధారం గ్రామంలో శాసనసభ్యులు సత్యనారాయణ రావు ఆదివారం పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను ఈడబ్ల్యూఐడీసీ డీఈ రామకృష్ణ, ఏఈ జీవన్ కుమార్, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు పరిశీలించారు. అంగన్వాడి భవన నిర్మాణానికి భూసేకరణ, పాఠశాల ప్రహారీ గోడ పునరుద్ధరణ పనులు, పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఇతర మౌలిక వసతుల కల్పనల కొరకు అధికారులతో చర్చించారు. బస్టాండు సెంటర్లో కొత్తగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆర్చి పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు.గ్రామం లోని అన్ని పనులకు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. త్వరలోనే ఇట్టి అన్ని పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.








