Mahaa Daily Exclusive

  చేనేతలకు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు టీపీసీసీ చేనేత విభాగం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత..!

Share

వరంగల్ మహా;

చేనేత విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షులు దాసరి రాజశేఖర్ ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన చేనేతలకు రుణమాఫీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిప్ప వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాసాని కరుణాకర్ నేత హాజరయ్యారు. ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేనేత కార్మికులకు 33 కోట్ల రూపాయల మేర చేనేత రుణమాఫీ చెయ్యడం జరిగింది. గత ప్రభుత్వంలో కేటీఆర్ చేనేత మంత్రిగా ఉండి చెయ్యని రుణమాఫీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సు ప్రారంభోత్సవం లో మాట ఇచ్చి 2017 ఏప్రిల్ 1 సం నుండి ఆగస్ట్ 2024 మార్చ్ 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న లక్షలోపు వ్యక్తి గత రుణాలను మాపి చేసి చేనేత కుటుంబాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలంగాణ చేనేత కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కొత్తవాడ లోని చేనేత కార్మికులు స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు సంబరాలు చేసుకోవాలని ఇందులో చేనేత విభాగం రాష్ట జిల్లా కార్యవర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంబి మురళి, ఈగ శ్రీధర్, కట్ల స్వామి, ఆడెపు చంద్రమౌళి, గుర్రం రాజమౌళి, ఆనందం వెంకటయ్య, గోంగూర నారాయణ, నాసం లావణ్య, వంగ రేఖా, కందకట్ల సరళ, జెట్టబోయిన స్వరూప పాల్గొన్నారు.

Latest