Mahaa Daily Exclusive

  శ్రీ బీరన్న స్వామి బోనాలకు నన్నపునేనికి ఆహ్వానం

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం 40వ డివిజన్ పరిధిలో ఈనెల 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు, 40 డివిజన్ కు చెందిన కురుమ కులస్తుల ఆరాధ్య దైవం అయిన శ్రీ బీరన్న స్వామి బోనాల పండుగ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, బోనాల ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ బడతాయి.
ఈ బోనాల పండుగను పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ను శాలువాతో ఘనంగా సత్కరించి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 40 డివిజన్ కార్పొరేటర్ దేవాలయ చైర్మన్ మారుపల్లి రవి, ధర్మకర్తలు మిరియాల కుమారస్వామి మండల ప్రమీల గౌడ కోటేశ్వర్ మారుపల్లి గౌతమ్, కురుమ సంఘం కులస్తులు ఉన్నారు.