Mahaa Daily Exclusive

  ఐ సి సి అధ్యక్షుడు ఖర్గే సభను విజయవంతం చేయాలి – టీపీసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ..!

Share

కాటారం, మహా :
హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియం లో ఈ నెల 4వ తేదీ న జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని టీపీసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు అన్నారు. గురువారం గ్రామ శాఖ అధ్యక్షులకు మొదలు మండల పార్టీ అధ్యక్షులకి ఎంపీపీలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పిలుపునిచ్చారు, శ్రీనుబాబు మాట్లాడుతూ గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే మొదటిసారి అని శ్రీను బాబు తెలిపారు,తెలంగాణ అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు ఉంటాయన్నారు,ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు,4వ,తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3:00 గంటలకళ్ళ మంథని నియోజకవర్గంలోని గ్రామ శాఖ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు జిల్లా శాఖ అధ్యక్షులు ఒకరికొకరు సమాచారం చేరవేసుకొని సమన్వయంతో సభకు హాజరుకావాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు తెలిపారు.

Latest