రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ నుండి ఇబ్రహీంపట్నం వరకు, పెద్ద చెరువు కట్ట కింద ఇరు వైపుల ఉన్న చెట్లు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న కారణంగా, ప్రమాదకరంగా ఉన్న ఈ చెట్లను వెంటనే తొలగించాలని, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బిజేపీ అధ్యక్షులు ముత్యాల మహేందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డికి వినతిపత్రం అందించడం జరిగింది. అనంతరం మహేందర్ మాట్లాడుతూ… ప్రజల శ్రేయస్సు కొరకై సమస్యలను పరిష్కరించాలని, మున్సిపల్ కమిషనర్ను కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆడెపు రాఘవేంద్ర, బీజేవైఎం జిల్లా నాయకులు అనిల్ విజయ్, రూపక్, బీజెపీ మున్సిపల్ నాయకులు జోర్రిగల అశోక్, ఆకుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 60








