Mahaa Daily Exclusive

  నేడు హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు గ్రామస్థాయి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి ..!కంది శ్రీ‌నివాస రెడ్డి పిలుపు..!

Share

ఆదిలాబాద్ మ‌హా : జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా, నేడు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి, భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పాల్గొంటున్న సందర్భంగా, గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి సభను జయపద్రం చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి
ఒక ప్ర‌క‌ట‌న‌లో పిలుపు
నిచ్చారు. పార్టీని గ్రామ‌స్థాయిలో సంస్థగతంగా మరింత బలోపేతం చేసి, ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, అందుకు తీసుకోవల్సిన చర్యలపై పార్టీ శ్రేణలకు, ఖర్గే దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాల తీరు తెన్నులపై పార్టీ శ్రేణులతో చర్చించడంతో పాటు, ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల‌న్న‌ తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు తెలియజేయునట్లు తెలిపారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలోతరలివచ్చి విజయవంతం చేయాలని, ఖర్గే సందేశాన్ని గ్రామాలలోని ప్రజలకు చేరవేయాలని సూచించారు.