రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జై బావు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా, నేడు హైదరాబాదులో నిర్వహించనున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి, భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పాల్గొన్న సందర్భంగా, ఈ యొక్క బహిరంగ సభకు గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి సభను జయపద్రం చేయాలని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఈసి శేఖర్ మామ, మాజీ జెడ్పిటిసి భూపతిగల్ల మహిపాల్, జిల్లా సేవాదళ అధ్యక్షులు మంకాల దాస్, డిసిసి ఉపాధ్యక్షులు ముత్యాలమ్మ రాజశేఖర్ రావు, కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు జయమ్మ, మారుతి సాగర్ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులతో, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే మాట్లాడటం జరుగుతుందని, ఇదీ చరిత్రలో ఒక గొప్ప సమావేశమని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిల్లో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలతో మాట్లాడనున్నారని తెలిపారు. పార్టీని సంస్థగతంగా మరింత బలోపేతం చేసి, ఎలా ముందకు తీసుకువెళ్లాలని, అందుకు తీసుకోవల్సిన చర్యలపై పార్టీ శ్రేణలకు, ఖర్గే దిశా నిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాల తీరు తెన్నులపై పార్టీ శ్రేణులతో చర్చించడంతో పాటు, ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు తెలియజేయునట్లు తెలిపారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలోతరలివచ్చి విజయవంతం చేయాలని, ఖర్గే సందేశాన్ని గ్రామాలలోని ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల అధ్యక్షులు మస్కు నరసింహ, జడల రవీందర్ రెడ్డి, రామ్ రెడ్డి, మున్సిపాలిటీల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








