Mahaa Daily Exclusive

  మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ మూడు వారాల కు పైగా ప్రజల ఇక్కట్లు పైపులైను రిపేరు చేసిన మరుసటి రోజే లీకేజీ..!

Share

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మూడు వారాలపైగా మిషన్ భగీరథ మంచి నీరు సరఫరా జరుగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటారం రెవెన్యూ గ్రామానికి నీరు సరఫరా చేసే ప్రధాన పైప్లైన్ పగిలిపోయింది. రిపేరు కోసం జెసిపి తో మట్టిని తీసినపుడు పైప్ లైన్ పూర్తిగా ధ్వంసం అయింది. బుధవారం పైప్లైన్ రిపేర్ చేసినట్టు గ్రామ కార్యదర్శి ప్రకటించారు. వాటర్ ట్యాంక్ నుండి నీటిని వదిలినప్పుడు పైప్ లైన్ రిపేరు చేసిన కనెక్షన్ వద్ద పెద్ద ఎత్తున నీటి లీకేజీ అవుతుండడంతో నీరు సరఫరా జరగలేదు.

పట్టింపు లేని సమస్య
గ్రామపంచాయతీకి పాలకవర్గం లేకపోవడం, నిధుల కొరత తో సమస్యలు పరిష్కారం కావడం లేదు. పైప్లైన్ రిపేర్ కోసం నిధులు లేవని రిపేర్ చేయించడంలో తీవ్ర జాప్యం చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలమైన కాటారం పంచాయతీకి। మండలానికి స్పెషలాఫీసర్ లేరు. ఇక్కడి సమస్య జిల్లా అధికారులకు తెలిపేవారు కరువయ్యారు. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా పని చేసిన డిఆర్డిఓ జిల్లా అధికారి నరేష్ ఇతర జిల్లాకు బదిలీ అయ్యారు కొత్తగా వచ్చిన అధికారికి బాధ్యతలు ఇవ్వలేదు. సుమారు నెలరోజులుగా గడిచిన పరిస్థితుల్లో మార్పు లేదు ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కాటారం మండల కేంద్రంలో పర్యటించినప్పటికీ అధికారులు ఉదాసీనత అలాగే ఉంది. కేంద్రమైన కాటారంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు విన్నవించిన సమస్య తీవ్రతను గుర్తించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.