కాటారం, మహా:
ఆషాఢమాసం బోనాల సీజన్.. ఆది, గురువారం లలో పల్లెల్లో బోనాల సందడి నెలకొంది. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గురువారం గ్రామాల్లో ఇంట్లో ప్రత్యేక పాత్రల లో వంటలు చేసి బోనం పోశారు. మహిళలు ఈ బోనం ను నెత్తి పైన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఇంటి నుండి ఊరేగింపుగా గ్రామ దేవత పోచమ్మ గుడికి తరలి వెళ్లారు. పసుపు కుంకుమ పూలతో పూజలు చేసి టెంకాయ కొట్టి బోనం తో నైవేద్యం సమర్పించారు. కోళ్లు, మేకల ను మొక్కి కట్ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రమైన కాటారంలో మహిళలు తలపు తలపై బోనం పెట్టుకొని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామ దేవత పోచమ్మ గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి మొక్కులు సమర్పించారు. గ్రామీణ ప్రజలు ఆషాడ మాసంలో గురు, ఆదివారాలలో బోనాల మొక్కులు చెల్లిస్తారు.
Post Views: 121








