కాటారం, మహా :
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల తో గోదావరి, ఉపనది ప్రాణహితకు వరద ఉధృతి పెరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత నదుల త్రివేణి సంగమ తీరం పుష్కర ఘాట్ లో మెట్లకు కొద్ది దూరంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. అంబట్ పల్లిలోని లక్ష్మీ బ్యారేజీలో సాయంత్రం 3 గంటల వరకు 73,400 క్యూసెక్కుల ఇన్ఫ్లో , అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులోని ఏడవ పిల్లర్లు కృంగిపోయినప్పటి నుండి సుమారు 22 నెలలుగా ప్రాజెక్టు గల 85 గేట్లుఎత్తివేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులలో నీరు నిల్వ ఉంచడం లేదు. వర్షాకాలంలో వచ్చిన వరద ప్రవాహం దిగువకు వెళుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు లేనప్పటికీ మారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నరికి వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. నేపథ్యంలో మేడిగడ్డ వద్ద గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది.








