Mahaa Daily Exclusive

  రైతులకు సకాలంలో ఎరువుల పంపిణీ చేయాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా..!

Share

ఆదిలాబాద్, మహా

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులను సకాలంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)ను సందర్శించారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రస్తుతం నిల్వ ఉన్న యూరియా, డీఏపీని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులను ఎల్లప్పుడు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం అక్కడి కస్తూర్భాగాంధీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి పూజ తదితరులు ఉన్నారు.

Latest