ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన సిరిపురే వసంత్ అనే కౌలురైతు కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సహాయంతో రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న గొర్రెలు పంపిణీ చేశారు. మూడు సంవత్సరాల క్రితం వసంత్ ఆత్మహత్య చేసుకోగా ఆయన కుటుంబానికి జీవనోపాధి కోసం రూ.40వేల విలువ గల గొర్రెలను గురువారం అందజేశారు. గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతుల కుటుంబాలకు గేదెలు, మేకలు,ఆవులు, గొర్రెలు, పిండిగిర్నీ, కుట్టుమిషిన్స్, కిరాణా షాప్ తదితర వాటిని సదరు సంస్థ సాయం అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మిత్ర ఫీల్డ్ కో ఆర్డినేటర్ ఆవుల రాకేష్, గణేష్,స్వామి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 40








