బోనకల్, మహా.
బోనకల్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయన పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, విచారణలో వున్న కేసులు, చార్జిషీట్, ఫంక్షనల్ వర్టికల్స్, 5s అమలు, హెచ్ ఆర్ ఎం ఎస్ జనరల్ డైరీ రికార్డులు, కేసుల్లో వున్న వాహనాలను పరిశీలించారు. రిసెప్షన్,పిటిషన్ విచారణలకు సంబంధించి సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్, పోలీస్ స్టేషన్ సెక్టార్ ఆఫీసర్ల భాధ్యతలు తదితర అంశాలను పరిశీలించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా సరిహద్దుల నుండి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.







