నేలకొండపల్లి, జూలై 26 మహా :
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజన్ అదుపుతప్పి… పల్టీ కొట్టింది… ఈ ఘటనలో డ్రైవర్ కు గాయాలైయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని మంగాపురంతండా కు’ చెందిన ధీరావత్ అరుణ్ తేజ్ అనే యువకుడు గ్రామంలో దుక్కి దున్నెందుకు ట్రాక్టర్ తీసుకెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోడ్డు పై అదుపు తప్పి…చెట్టు కు డీకొట్టి అక్కడ నుంచి పొలంలో పల్టీకొట్టింది. దీంతో డ్రైవర్‌కు గాయాలైయ్యాయి. రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జెసీబీ సహాయంతో స్థానికులు ట్రాక్టర్ ను బయటకు తీశారు.
Post Views: 38







