- పాకిస్థాన్ మరో కుట్ర
- హిందు, బీజేపీ నేతలను చంపేందుకు
- ఐఎస్ ఐ కుట్ర
- బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి పన్నాగం
- జమ్మూలోకి చొరబడ్డ ఏడుగురు ఉగ్రవాదులు
- తిప్పికొట్టిన భారత రక్షణ విభాగం
- తాజా పరిణామాలపై సీరియస్ నజర్
(వేదిక బ్యూరో)
పాకిస్థాన్ మరో పన్నాగం బయటపడింది. హిందూనేతలు, బిజెపి నేతలను చంపేందుకు వేసిన మెగాప్లాన్ ను భారత రక్షణ విభాగం సరైన సమయంలో గుర్తించింది. అమర్నాథ్ యాత్రలో ఈ విధ్వంసానికి ఐఎస్‌ఐ కుట్ర చేసినట్లు భారత రక్షణ విభాగం గుర్తించింది. బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి పన్నాగం పన్నినట్టు తెలిపింది. హిందు, బీజేపీ నేతలే టార్గెట్ గా విధ్వంసానికి ఐఎస్‌ఐ ప్లాన్ చేసినట్లు చెప్పారు. పంజాబ్ లోని గ్యాంగ్ స్టార్లు, ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. గత నెల పఠాన్‌కోట్ పరిసరాల్లో ఉగ్రవాద కదలికలను గుర్తించింది ఇండియన్ ఆర్మీ. జమ్మూలో ఏడుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనక పాక్ కుట్ర ఉందని భావిస్తోంది ఇండియన్ ఆర్మీ.
పాకిస్తాన్ కుట్రకు చెక్ పెట్టిన జనాన్లు
అప్రమత్తతతో పాక్ కుట్రలను ఎప్పటికపుడు భారత బలగాలు భగ్నం చేశాయి. కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా ప్రధాని మోడీ పాక్ కు స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చారు. నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలపై పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ దాడిని భారత ఆర్మీ దళాలు భగ్నం చేశాయి. దాడిలో పాల్గొన్నబిఎటి బృందంలో టెర్రరిస్టు సంస్థలతో సన్నిహితంగా పనిచేసే వారి కమాండోలతో సహా సాధారణ పాకిస్తాన్ ఆర్మీ దళాలు ఉన్నట్లు రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో దీనిని సీరియస్ గా తీసుకుని కుట్రలను పసిగట్టేందుకు మరింత అలర్ట్ గా వ్యవహరిస్తోంది. కుక్కతోక వంకరే అన్న చందంగా పాక్ ఉగ్రవాదుల చొరబాటు కుట్రలపై భారత ప్రభుత్వం అత్యంత సీరియస్ గా వ్యవహరిస్తోంది.
…….








