AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు కీలక పిలుపునిచ్చారు. వారానికి ఒకసారి యువత చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల చేనేత కళాకారుల అభివృద్ధికి తోడ్పడిన వాళ్లమవుతామని తెలిపారు. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఊతం ఇస్తుందని హామీ ఇచ్చారు. చేనేత మన దేశ సంస్కృతికి, స్వాతంత్య్ర ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచిందని పేర్కొన్నారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు.
Post Views: 93







