Mahaa Daily Exclusive

  డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్ కళ్యాణ్

Share

AP: డోలి రహిత గిరిజన గ్రామాల సాధనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎదురయ్యే సవాళ్లను ప్రణాళికబద్ధంగా అధిగమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అడవితల్లి బాట’ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను స్థానిక ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు.

Latest